సరికొత్త ఆలోచనల వేదిక ఈ సండే సినిమా: సంచాలకులు మామిడి హరికృష్ణ

0
10
views

ఫిలిం మేకింగ్ లో ఎప్పటికప్పుడు కొత్తకొత్త ఆలోచనలతో, సృజనాత్మకతతో సరికొత్తగా తీసినప్పుడే ప్రేక్షకుల మన్ననలు పొందుతుందని తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ అన్నారు. భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహిస్తున్న సండే సినిమాలో భాగంగా ది ప్లెడ్జ్ (అమెరికన్ చిత్ర) ప్రదర్శన జరిగింది. ఈ చిత్రాన్ని యంగ్ ఫిలిం మేకర్ సంజీవ్ పటేల్ విశ్లేషణ (క్యురేట్) చేశాడు.

సినిమాను ఎలా తీయాలి, ఎలాంటి కథలను సినిమాలుగా తీయోచ్చనే ఆలోచన ప్రతిఒక్కరిలో ఉంటుందని, అలాంటి సందర్భంలో ఇంతకుముందున్న గొప్ప సినిమాలను, ప్రపంచ ప్రసిద్ద సినిమాలను చూసి నేర్చుకోవచ్చని, అందుకోసమే ఈ సండే సినిమాను ఏర్పాటుచేశామన్నారు. తెలుగులో వస్తున్న మెయిన్ స్ట్రీమ్ సినిమాలను చూసి ఇలాంటి సినిమాలు తీయాలేమో అనుకుంటున్న యంగ్ ఫిలిం మేకర్స్ కొత్త ఆలోచనలతో, క్రియేటివిటితో మానవీయకోణంలో సినిమాలను తీసే దిశగా ఈ కార్యక్రమం ఉత్తేజపరుస్తుందని పేర్కొంటూ, ఈనాటి సండే సినిమాలో ది ప్లెడ్జ్ సినిమాను క్యూరేట్ చేసిన సంజీవ్ పటేల్ ను అభినందించి సన్మానించారు.

LEAVE A REPLY