17వ లోక్‌సభ తొలి సమావేశాలు ప్రారంభం

0
5
views

కొత్తగా కొలువుదీరిన 17వ లోక్‌సభ తొలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. అంతకు ముందు రాష్ట్రపతి భవన్‌లో 17వ లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా బీజేపీ ఎంపీ వీరేంద్రకుమార్ చేత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారం చేయించారు. లోక్‌సభ ప్రోటెం స్పీకర్‌గా బీజేపీ ఎంపీ వీరేంద్ర కుమార్ కొత్తగా ఎన్నికైన సభ్యుల చేత ప్రమాణస్వీకారం చేయిస్తున్నారు. ఇవాళ, రేపు కొత్త ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

మొదటగా ప్రధాని నరేంద్ర మోదీ, తర్వాత కేబినెట్‌ మంత్రులు, ప్యానెల్‌ ఛైర్మన్ల ప్రమాణ స్వీకారం చేస్తారు. తర్వాత ఆంగ్ల అక్షర క్రమంలో రాష్ట్రాల వారీగా ఎంపీల ప్రమాణాలు చేయనున్నారు. అనంతరం నియోజకవర్గాల క్రమసంఖ్య ఆధారంగా ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేయించనున్నారు.

రాజ్యసభ సమావేశాలు 20 నుంచి మొదలవుతాయి. ఉభయ సభల సమావేశాలు జూలై 26న ముగుస్తాయి. ఈసమావేశాల్లో సభ్యుల ప్రమాణ స్వీకారం, స్పీకర్‌ ఎన్నిక, రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ, ఆర్థిక సర్వే, కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టడం వంటివి ఉంటాయి.

LEAVE A REPLY