పీఏసీ చైర్మన్‌గా అ‍క్బరుద్దీన్‌ ఒవైసీ

0
13
views

తెలంగాణ శాసనసభలో ప్రజా పద్దులు (పీఏసీ) కమిటీ చైర్మన్‌ గా ఎంఐఎం పార్టీ శాసనసభ పక్షం నేత, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీకి దక్కింది. పీఏసీ చైర‍్మన్‌ పదవిని ప్రధాన ప్రతిపక్షానికి ఇవ్వడం ఆనవాయితీ, 2018 డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆ స్థానాన్ని దక్కించుకుంది. ఎన్నికలు తరువాత 12మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ లో చేరడంతో ఆ సంఖ్య 6కు చేరింది. దింతో వారు ఆ హోదాను కోల్పోయారు. ఏడు మంది శాసనసభ్యులతో ఎంఐఎం పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. దింతో ఆ పార్టీకి చెందిన అక్బరుద్దీన్ ఒవైసీని పబ్లిక్ అకౌంట్స్ కమిటీ(పీఏసీ) చైర్మన్‌గా స్పీకర్ పోచారం ప్రకటించారు.  పీఏసీ చైర్మన్‌‌కు కేబినెట్ హోదా ఉంటుంది. 

అసెంబ్లీ కమిటీల చైర్మన్‌ల నియామకం

అంచనాల కమిటీ చైర్మన్‌గా దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట లింగారెడ్డి, పబ్లిక్ అండర్‌టేకింగ్ కమిటీ చైర్మన్‌గా ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డిని స్పీకర్ ప్రకటించారు. పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ సభ్యులుగా కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, ప్రకాశ్‌గౌడ్, అబ్రహం, శంకర్‌నాయక్, దాసరి మనోహర్‌రెడ్డి, నల్లమోతు భాస్కర్‌రావు, అహ్మద్ పాషా ఖాద్రీ, కోరుకంటి చందర్‌లను నియమించారు.

LEAVE A REPLY