అల్లం నారాయణ పదవీ కాలం పొడిగింపు

0
43
views

తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ పదవీ కాలాన్ని ప్రభుత్వం మరో ఏడాది పాటు పొడిగించింది. దీనికి సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతకం చేశారు. అల్లం నారాయణ పదవీ కాలం ఈ ఏడాది జూన్‌ 30తో పూర్తయింది. అయన పదవీ కాలాన్ని పొడిగిస్తూ సంబంధించిన ఉత్తర్వులు మంగళవారం వెలువడనున్నాయి.

ఈ సందర్భంగా ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి అల్లం నారాయణ కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం నాలుగేండ్లుగా అమలుపరిచిన జర్నలిస్టుల శిక్షణా, సంక్షేమ కార్యక్రమాల పై మీడియా అకాడమీ ప్రచురించిన పుస్తకాన్ని సీఎం కెసిఆర్ కు అందజేశారు.

LEAVE A REPLY