హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా భాద్యతలు స్వీకరించిన బండారు దత్తాత్రేయ

0
7
views

కేంద్రమాజీ మంత్రి, బీజేపీ సీనియర్‌ నాయకుడు బండారు దత్తాత్రేయ హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్ర 27వ గవర్నర్‌గా ప్రమాణస్వీకారం చేశారు. ఆయన చేత హిమాచల్‌ ప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రామ సుబ్రహ్మణ్యన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, మాజీ మంత్రి డీకే అరుణ, మాజీ ఎమ్మెల్యే చింతల సీరాంచంద్ర రెడ్డి, దత్తాత్రేయ కుటుంబసభ్యులు హాజరయ్యారు.

LEAVE A REPLY