నేటి నుండి బతుకమ్మ ఫిల్మోత్సవం

0
66
views

బతుకమ్మ పండుగ వేడుకల్లో భాగంగా సెప్టెంబరు 28వ తేది నుండి అక్టోబర్ 06వ తేది వరకు రవీంద్రభారతిలోని పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్ లో బతుకమ్మ ఫిల్మోత్సవం – 2019 నిర్వహిస్తున్నామని రాష్ట్ర భాషా సాంస్కృతిక సంచాలకులు మామిడి హరికృష్ణ తెలిపారు. వారంరోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో ఇటీవల కాలంలో ప్రేక్షకాదరణ పొందిన ఎనిమిది సినిమాల ప్రదర్శన ఉంటాయని చెప్పారు. ఈ చిత్రాల ప్రదర్శన ప్రతిరోజు సాయంత్రం 5.00 గంటలకు ప్రారంభమవుతుందని , దీనికి అందరు ఆహ్వానితులే అని అన్నారు.

సినిమా ప్రదర్శన వివరాలు:
28వ తేదీన – దొరసాని
29వ తేదీన – హవా
30వ తేదీన – ఓ బేబి
01వ తేదీన – ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ
02వ తేదీన – అంతరిక్షం
03వ తేదీన – బిలాల్‌పూర్ పోలీస్ స్టేషన్
04వ తేదీన – నువ్వు తోపురా
05వ తేదీన – మల్లేశం
06వ తేదీన – బతుకమ్మ (2019) పాటలు

LEAVE A REPLY