మహిళా సంక్షేమానికి ప్రభుత్వం కృషి: మంత్రి శ్రీనివాస్ గౌడ్

0
57
views

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగకు ఆడబిడ్డలందరికీ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ కానుక నాణ్యమైన చీరెలను అందిస్తుందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్ అన్నారు. మహబూబ్ నగర్ రూరల్ మండలం లోని పోతన్ పల్లి, మాచన్ పల్లి గ్రామాలలో మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణి కార్యక్రమంలో ఆయన పాల్గొని మహిళలకు చీరెలను పంపిణి చేశారు.

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ నేతన్నలకు ఉపాధి కల్పించడంతో పాటు ఆడబిడ్డలకు ప్రభుత్వ కానుకగా బతుకమ్మ చీరెలను టీఆర్‌ఎస్ ప్రభుత్వం,సీఎం కేసీఆర్ అందిస్తుందని మంత్రి అన్నారు. ప్రభుత్వం ఆడబిడ్డలకు అన్ని విధాల అండగా ఉంటున్నదని, బతుకమ్మ చీరెలు పంపిణీ చేయడమే అందుకు నిదర్శనమని అన్నారు. మహిళల కోసం ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. గత ప్రభుత్వాలు చేయలేని అనేక సం క్షేమ పథకాలను టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసి చూపిస్తోందని పేర్కొన్నారు. దసరా, బతుకమ్మ పండుగులను ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకోవాలని కోరారు.

LEAVE A REPLY