టిఆర్ఎస్ లో చేరిన బిజెపి కార్పొరేటర్లు

0
10
views

భారతీయ జనతా పార్టీకి చెందిన ముగ్గురు నిజామాబాద్ నగర పాలక సంస్థ కార్పొరేటర్లు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. హైదరాబాద్‌లోని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నివాసంలో, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా ఆధ్వర్యంలో నిజామాబాద్ 8వ డివిజన్ కార్పొరేటర్ విక్రమ్ గౌడ్, 9వ డివిజన్ కార్పొరేటర్ సాధు సాయి వర్ధన్, 50వ డివిజన్ కార్పొరేటర్ బట్టు రాఘవేందర్ లకు గులాబీ కండువా కప్పి మంత్రి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్బంగా కార్పొరేటర్లు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు నచ్చి తాము పార్టీలో చేరినట్లు తెలిపారు.

LEAVE A REPLY