మన చరిత్రకు ఆనవాళ్లే పుస్తకాలు: డా. ఎస్ కె జోషి

0
15
views

రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. ఎస్ కె జోషి చేతుల మీదుగా పుస్తకాల ఆవిష్కరణ . తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన మూడు పుస్తకాలను సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. ఎస్ కె జోషి ఆవిష్కరించారు .

తెలంగాణ రుచులపై శాఖాహార , మాంసాహార వంటల వివరాలు , వాటిని తయారుచేసే విధానం గూర్చి జ్యోతి వలబోజు రాసిన ‘తెలంగాణ రుచులు’ పుస్తకం , పెన్నా శివరామ కృష్ణ రాసిన ‘తారీఖుల్లో తెలంగాణ పుస్తకం’ , యువ పరిశోధకుడు అరవింద్ ఆర్య తెలంగాణ రాష్ట్రంలోని పురాతన కట్టడాలపై పరిశోధన చేసి రాసిన ” మనకు తెలియని తెలంగాణ ” పుస్తకాలను ఆవిష్కరించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ 20 ఏళ్లుగా వివిధ రకాల వంటల గురించి రాస్తున్న జ్యోతి వలబోజు , తేదీల ప్రకారం తెలంగాణ చరిత్రను గురించి రాసిన పెన్నా శివరామకృష్ణలను, చిన్న వయసులోనే చరిత్రపై పుస్తకం రాసిన అరవింద్ ఆర్యను అభినందించారు. ఈ కార్యక్రమంలో పర్యాటక , సాంస్కృతిక శాఖల ఇంచార్జ్ కార్యదర్శి పార్థసారథి , భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ , రచయితలు పాల్గొన్నారు .

LEAVE A REPLY