తెలంగణాను క్రీడా హబ్ గా నిలుపుతాం: శ్రీనివాస్ గౌడ్

0
8
views

తెలంగాణ రాష్ట్రంలో క్రీడలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రోత్సహాం అందిస్తున్నారన్నారని, దేశంలోనే తెలంగణాను క్రీడా హబ్ గా తయారు చేస్తామని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో మంత్రి ఛాంబర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు క్రీడా పాలసీ పై ఏర్పాటు చేసిన సబ్ కమిటీ బుధవారం సమావేశమై సమగ్ర క్రీడా పాలసీపై చర్చిస్తుందన్నారు. క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధ్య‌క్ష‌త‌న ఏర్పాటైన ఈ కేబినెట్ సబ్ క‌మిటీలో మంత్రులు శ్రీ.కేటీఆర్, శ్రీ ఎర్రబెల్లి దయాకరరావు, శ్రీమతి సబిత ఇంద్రారెడ్డి సభ్యులుగా ఉన్నారు.

ఈ సమావేశంలో రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి, మౌళిక సదుపాయాల కల్పన, క్రీడాకారులకు ప్రోత్సాహకాల వంటి అంశాలపై చర్చించి, రాష్ట్రంలోని సీనియర్ క్రీడాకారులు, కోచ్ లు, స్పోర్ట్స్ జర్నలిస్టులు, క్రీడా సంఘాల, క్రీడా అవార్డు గ్రహీతల అవసరమైన సలహాలు, సూచనలను తీసుకొని మెరుగైన క్రీడా పాలసీని రుపొంచించి, సమగ్ర నివేదికను ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ కి సమర్పిస్తామన్నారు.

LEAVE A REPLY