తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా సుష్మ స్వరాజ్ ??

0
972
views

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ భేటీ అయ్యారు. సుమారు రెండు గంటలపాటు సుధీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాల మధ్య పెండింగ్ లో ఉన్న సమస్యలపై చర్చించారు. అయితే ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు ప్రత్యేకంగా ఇద్దరు కొత్త గవర్నర్ల నియామకంపైనే ప్రధానంగా చర్చ జరిగిందని విశ్వసనీయ సమాచారం.

ఒకరాష్ట్రానికి గవర్నర్‌గా నరసింహనే కొనసాగించి, మరో రాష్ట్రానికి బిజెపి సీనియర్ నాయకురాలు, మాజీ కేంద్ర మంత్రి సుష్మ స్వరాజ్ ను నియమించే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అనారోగ్య కారణాల వల్ల ఆమె పోటీ చేయలేదు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆమె తెలంగాణ కి మద్దతుగా నిలిచారు.

LEAVE A REPLY