17వ లోక్‌సభలో అత్యంత పిన్నవయస్కురాలైన ఎంపీ

0
68
views

17వ లోక్‌సభలో అత్యంత పిన్నవయస్కురాలైన ఎార్లమెంటు సభ్యురాలిగా ఒడిశాకు చెందిన ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ చంద్రాణీ ముమ్రూ(25 ఏళ్ల 11 నెలలు) నిలిచారు. ఆమె ఒడిశాలోని ఆదివాసీ జన బాహుళ్యంగల ప్రాంతమైన క్యోంఝర్ సీటు నుంచి బిజూ జనతాదళ్ పార్టీ నుంచి పోటీచేశారు. ఇంతకుముందు అత్యంత పిన్నవయస్కుడిగా హర్యానా రాష్ట్రం, హిసార్ నియోజకవర్గం నుండి గెలిచిన దుశ్యంత్ చౌతాలా (26) ప్రాతినిధ్యం వహించాడు.

రెండుసార్లు బీజేపీ ఎంపీగా పనిచేసి, బీజేపీ నుంచి బరిలోకి దిగిన అనంత్ నాయక్‌ను 66,203 ఓట్ల తేడాతో ఆమె ఓడించారు. జూలై 16న చంద్రాణి 26వ పుట్టినరోజు. ఆమె 2017లో భువనేశ్వర్‌లో బీటెక్ పూర్తిచేసి, ప్రభుత్వ ఉద్యోగాల వేటలో పోటీ పరీక్షల కోసం సిద్ధమవుతున్నారు. ఈ సమయంలో ఆమె చిన్నాన్న హర్మోహన్ సోరెన్ ఆమె దగ్గర ఎన్నికల్లో పోటీ గురించి ప్రస్తావించారు. దీనిని ఆమె అంతగా పట్టించుకోకపోయినప్పటికీ, బీజేపీని సమర్థవంతంగా ఎదుర్కోగల అభ్యర్థి చంద్రాణి అని బిజూ జనతాదళ్ గుర్తించి, ఆమెకు టిక్కెట్ కేటాయించింది.

కాగా ఎన్నికల్లో గెలిచిన తరువాత చంద్రాణి మాట్లాడుతూ తాను ఈ ప్రాంతం అభివృద్ధికి, యువత ఉపాధికి, మహిళలు, ఆదీవాసీయుల అభ్యున్నతికి పోరాడతానని తెలిపారు.

LEAVE A REPLY