తెలుగుదేశం మాజీ ఎంపీ శివప్రసాద్ కన్నుమూత

0
20
views

టీడీపీ మాజీ ఎంపీ, సినీ నటుడు ఎన్. శివప్రసాద్(68) శనివారం మధ్యాహ్నం కన్నుమూశారు. అయన గత కొన్నిరోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. శివప్రసాద్‌ మృతిపట్ల ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు.

శివప్రాద్ 2009, 2014 తెలుగుదేశం పార్టీ తరఫున చిత్తూరు ఎంపీగా పోటీచేసి విజయం సాధించారు. అయితే 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి రెడ్డెప్ప చేతిలో ఓడిపోయారు. శివప్రసాద్ రాజకీయ రంగంలోనే కాకుండా సినిమాల్లోనూ రాణించాడు. ఆయన అనేక సినిమాల్లో నటించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అనంతరం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా హామీని నెరవేర్చాలంటూ పార్లమెంట్ ముందు వెరైటీ వేషధారణల్లో ఆందోళనలు చేసి అందరి దృష్టిని ఆకర్షించారు.

LEAVE A REPLY