రాష్ట్రంలో మళ్ళీ ఎమ్మెల్సీ ఎన్నికల సందడి

0
255
views

తెలంగాణా శాసనమండలిలో రాజీనామాలు చేసి ఖాళీగా ఉన్న నాలుగు స్థానాల్లో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిపేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్, మల్కాజ్ గిరి, మునుగోడు నుండి శాసనసభకు ఎన్నికైన పట్నం నరేందర్‌రెడ్డి, మైనంపల్లి హన్మంతరావు, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తమ ఎమ్మెల్సీ స్థానాలకు రాజీనామాచేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరుతూ ఎమ్మెల్సీకి పదవికి కొండా మురళి రాజీనామా చేశారు.

వీరి రాజీనామాలతో స్థానిక సంస్థల కోటాలో రంగారెడ్డి, నల్గొండ, వరంగల్‌ ఎమ్మెల్సీ స్థానాలకు ఖాళీలు ఏర్పడటంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. వీరిలో పట్నం నరేందర్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి , కొండా మురళి స్థానిక సంస్థల నియోజకవర్గాల నుంచి ఎన్నికయ్యారు. మైనంపల్లి హన్మంతరావు ఎమ్మెల్యే కోటాలో ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఉన్న ఎంపీటీసీ, జడ్పీటీసీలకే ఓటు హక్కు ఉండనుంది.

కేంద్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల నియోజకవర్గాలకు సంబంధించి మే 7వ తేదీన నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది..

ఎన్నికల షెడ్యూల్‌
మే 7న నోటిఫికేషన్‌
నామినేషన్లకు చివరి తేదీ: మే 14
నామినేషన్ల పరిశీలన : మే 15
నామినేషన్ల ఉపసంహరణ: మే 17
పోలింగ్‌: మే 31(ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు)
కౌంటింగ్‌: జూన్‌ 3
జూన్‌ 7 లోపల ఎన్నికల ప్రక్రియ పూర్తి

LEAVE A REPLY