ఉప ఎన్నికల షెడ్యూల్ ను విడుడల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం

0
43
views

దేశవ్యాప్తంగా జరగాల్సిన ఉప ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈనెల 23న నోటిఫికేషన్‌ విడుదలకాగా, నామినేషన్ల దాఖలుకు ఈనెల 28 చివరి తేదీగా ప్రకటించారు. అక్టోబర్‌ 1న నామినేషన్ల పరిశీలనకాగా, అక్టోబర్ 21న పోలింగ్ జరగనుంది. అక్టోబర్‌ 24న ఫలితాలు విడుదలకానునట్టు సీఈసీ సునీల్ అరోరా తెలిపారు.

అరుణాచల్ ప్రదేశ్, బీహార్, చత్తీస్‌ఘర్, అస్సామ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మేఘాలయ, ఒడిషా, పుదుచ్చేరి, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, తమిళనాడు, తెలంగాణలో రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరగనున్నాయి.

LEAVE A REPLY