ఈ సమావేశాలు ఏ కులాలకు వ్యతిరేకం కాదు: ఈటెల రాజేందర్

0
11
views

కోట్లాడి తెచుకున్న హక్కులు కోసం, రిజర్వేషన్లకు న్యాయం జరిగే వరకు పోరాడాలని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. సరూర్‌నగర్‌ స్టేడియంలో జరిగిన ఓబీసీ జాతీయ మహాసభలో అయన పాల్గొన్నారు. మన దేశంలో ఏ కులానికైతే అన్యాయం జరుగుతుందో అప్పుడే ఆ కులం సంఘటిత మవుతుందని తెలిపారు. ఈ సభకు 18 రాష్ట్రాల నుంచి వచ్చిన ఓబీసీ నాయకులకు అయన ధన్యవాదాలు తెలిపారు.

ఇలాంటి సమావేశాలు ఏ కులాలకు వ్యతిరేకం కాదని, వీటికి తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ఉందన్నారు. తెలంగాణలో మొత్తం 85 శాతం అణగారిన వర్గాలు ఉన్నాయని పేర్కొన్నారు. తెలంగాణలో బీసీల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందన్నారు. విదేశాల్లో ఉన్నతవిద్యను అభ్యసించదలచిన బీసీ విద్యార్థులు మహాత్మా జ్యోతిబాపూలే బీసీ ఓవర్సీస్ విద్యానిధి పథకం ద్వారా ప్రభుత్వం రూ.20 లక్షల ఆర్థిక సహాయం అందిస్తుందని తెలిపారు.

LEAVE A REPLY