కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి కన్నుమూత

0
22
views

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సూదిని జైపాల్‌రెడ్డి మృతి చెందారు.
కొద్ది రోజులుగా జైపాల్ రెడ్డి నిమోనియాతో బాధపడుతు గచ్చిబౌలిలోని ఏషియన్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. అయన వయసు 77 సంవత్సరాలు.

మహబూబ్‌నగర్ జిల్లా మాడుగులలో 1942 జనవరి 16న జన్మించారు. అయన కల్వకుర్తి నియోజకవర్గం నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తొలిసారిగా 1984లో మహబూబ్‌నగర్ లోకసభ నియోజకవర్గం నుంచి, 1999 మరియు 2004లలో మిర్యాలగూడ లోకసభ నుంచి, 2009లో చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికయ్యారు. రాజ్యసభ సభ్యునిగా 1990 మరియు 1996 లలో రెండు సార్లు ఎన్నుకోబడ్డారు. ప్రధాని ఐకే గుజ్రాల్‌ కేబినెట్‌లో రెండు సార్లు, మన్మోహన్‌సింగ్ కేబినెట్‌లో రెండు సార్లు కేంద్రమంత్రిగా పనిచేశారు. 1998లో ఉత్తమ పార్లమెంటేరియన్‌గా పురస్కారం అందుకున్నారు. దక్షిణాది నుంచి తొలిసారి ఉత్తమ పార్లమెంటేరియన్‌ పురస్కారం అందుకున్న నేతగా జైపాల్‌రెడ్డి గుర్తింపు పొందారు. 

LEAVE A REPLY