మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి కన్నుమూత

0
21
views

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందారు. ముత్యంరెడ్డి స్వస్థలం సిద్ధిపేట జిల్లా తొగుట మండలం తుక్కాపూర్ గ్రామం. ఆయన మెదక్‌ జిల్లా దొమ్మాట నియోజకవర్గం నుంచి 1989లో టీడీపీ ఎమ్మెల్యేగా తొలిసారి గెలుపొందారు. 1994, 1999 ,2009లో దుబ్బాక ఎమ్మెల్యేగా గెలిచారు. తెలుగుదేశం హయాంలో 1999లో ఆయన పౌరసరఫరాల శాఖ మంత్రిగా పనిచేశారు. 2019 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి టికెట్‌ రాకపోవడంతో ఆయన టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు.

మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి మృతిపట్ల ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంత్రి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు. ముత్యంరెడ్డి అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సీఎస్ ఎస్‌కే జోషిని సీఎం ఆదేశించారు.

LEAVE A REPLY