తెలంగాణ నాటకరంగ సత్తాచాటిన తెగారం: సంచాలకులు మామిడి హరికృష్ణ

0
34
views

“పరుచూరి రఘుబాబు” స్మారక 29వ అఖిల భారత నాటక పోటీలు”లో జాబిల్లి కల్చరల్ సొసైటీ (నిజామాబాద్)వారు ప్రదర్శించిన “తెగారం” నాటకం ఆరు విభాగాల్లో అవార్డులను దక్కించుకుంది. ఉత్తమ దర్శకుడిగా డా. మల్లేశ్ బలాస్ట్, ఉత్తమ నటిగా సాలూరి జ్యోతిరాణి, ఉత్తమ ప్రతినాయకుడిగా రమణమూర్తి వంగల, ఉత్తమ జ్యూరీ నటిగా జయశ్రీ సునయన, ఉత్తమ రంగాలంకరణ ఉమాశంకర్ సురభి తో పాటు ఉత్తమ ప్రదర్శన వంటి ఆరు విభాగాల్లో అవార్డులను సొంతం చేసుకుంది. ఈ సందర్బంగా రవీంద్రభారతిలో అభినందన కార్యక్రమం నిర్వహించి తెగారం నాటక బృందాన్ని రాష్ట్ర భాషా సాంస్కృతి శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ అభినందించి వారిని సన్మానించారు.

ఈ సందర్బంగా మామిడి హరికృష్ణ మాట్లాడుతూ శివ సత్తుల జీవిత నేపథ్యంతో పెద్దింటి అశోక్ కుమార్ రచనలో డా. మల్లేశ్ బలాస్ట్ దర్శకత్వంలో వచ్చిన తెగారం నాటకం ప్రదర్శించిన ప్రతిచోటా అవార్డులను అందుకుంటూ తెలంగాణ నాటకరంగ సత్తాను చాటుతుందని అన్నారు. యువనాటకోత్సవం పేరిట అనేకమంది యువ రంగస్థల కళాకారులను, సాంకేతిక నిపుణులను నాటకరంగానికి పరిచయం చేశామని, లైటింగ్, సౌండ్, ప్రదర్శనల విషయంలో న్యూవేవ్ థియేటర్ దిశగా తెలంగాణ యువ నాటకరంగం దూసుకుపోతుందని అన్నారు.

LEAVE A REPLY