ఉద్యోగులను అభినందించిన సీఎం కేసీఆర్

0
214
views

తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల సంఘం వ్యవస్థాపక అధ్యక్ష్యుడు, రాష్ట్ర ఎక్సైజ్‌, పర్యాటక, సాంస్కృతిక, క్రీడ, యువజన సర్వీసులు మరియు పురావస్తు శాఖ మంత్రి నేతృత్వంలో ఉద్యోగుల ఐకాస ప్రతినిధులతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమావేశమయ్యారు. ఈ భేటీలో ఉద్యోగుల సంబంధిత అంశాలపై చర్చించారు. ఎన్నికల కోడ్‌ ముగిశాక అక్టోబర్‌ 21 మరోసారి సమావేశం అవుదామని కేసీఆర్ తెలిపారు. ఉద్యోగుల సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తానని వారికి హామీ ఇచ్చారు.

30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమల్లో ఉద్యోగులందరూ కలసికట్టుగా పనిచేసి విజయవంతం చేసినందుకు వారిని అభినందించారు. భవిష్యత్​నోనూ ఇదే స్ఫూర్తి కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీజీవో అధ్యక్షురాలు మమత, టీఎన్జీవో అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, టీజీవో ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, టీఎన్జీవోన ప్రధాన కార్యదర్శి మామిళ్ల రాజేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY