తెలంగాణలో త్వరలో నీరా స్టాల్ల్స్: మంత్రి శ్రీనివాస్‌ గౌడ్

0
62
views

గౌడ వృత్తిదారుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని త్వరలో రాష్ట్రంలో నీరా స్టాల్ల్స్ ను ప్రారంభించనున్నామని మంత్రి తెలిపారు. దీనికి సంబంధించిన దస్త్రంపై ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం సంతకం చేశారని తెలిపారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్ లో తొలి నీరా స్టాల్ ను ఏర్పాటు చేసి, మహారాష్ట్ర, కేరళ తరహాలో నీరా విక్రయ కేంద్రాలను రాష్ట్రమంతటా ఏర్పాటుచేస్తామని శ్రీనివాస్‌ గౌడ్ చెప్పారు. నీరాలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయని, షుగర్, మధుమేహం, క్యాన్సర్, లివర్, గుండె సంబంధిత వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలు చేస్తుందని మంత్రి చెప్పారు.

ఈ నీరా స్టాల్ల్స్ లైసెన్స్ కేవలం గౌడ సామాజికవర్గానికి ఇవ్వనున్నామని, ఈ వృత్తిపై ఆధారపడిన వారికే మాత్రమే నీరాను గీయడం, అమ్మే అధికారం ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారని మంత్రి తెలిపారు. గౌడ వృత్తిదారుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నీరా చట్టం తీసుకరావడం పట్ల మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.

LEAVE A REPLY