ఐపీఎల్ విజేత ముంబై ఇండియన్స్

0
41
views

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ 12వ సీజన్‌ టైటిల్‌ను ముంబై ఇండియన్స్‌ సొంతం చేసుకుంది. ఆదివారం హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం లో ముంబై, చెన్నై మధ్య ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్లో 1 పరుగు తేడాతో చెన్నై సూపర్‌కింగ్స్‌పై ముంబై ఇండియన్స్‌ విజయం సాధించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేపట్టిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. అనంతరం 150 పరుగుల లక్ష్యంతో బాటింగ్ చేసిన చెన్నై సూపర్‌కింగ్స్‌ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసి ఓటమి పాలైంది.

LEAVE A REPLY