సినారె పుస్తకాన్ని ఆవిష్కరించడం నా అదృష్టం: సీఎం జగన్ మోహన్ రెడ్డి

0
9
views

తాడేపల్లి సీఎం క్యాంప్‌ ఆఫీస్‌లో తెలుగు కవి, సాహితీవేత్త,జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డా. సి.నారాయణరెడ్డి రాజ్యసభలో చేసిన ప్రసంగాలపై, మాజీ రాజ్యసభ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌ రచించిన ‘పెద్దల సభలో తెలుగు పెద్ద’ అనే పుస్తకాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. సినారె లాంటి గొప్ప వ్యక్తి పుస్తకాన్ని ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నానని సీఎం వైఎస్‌ జగన్‌ తెలిపారు.

ఈ కార్యక్రమానికి సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జి జాస్తి చలమేశ్వర్, నేషనల్‌ జ్యూడిషియల్‌ అకాడమీ డైరెక్టర్‌ జస్టిస్‌ గోడ రఘురామ్, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY