తెలంగాణ గర్వించదగ్గ వ్యక్తి కాళోజి: శ్రీనివాస్ గౌడ్

0
33
views

తెలంగాణ ప్రభుత్వం & భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యం లో ప్రజాకవి కాళోజీ నారాయణరావు 105వ జయంతి ఉత్సవం – తెలంగాణ భాషా దినోత్స వం సోమవారం రవీంద్రభారతిలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ.వి.శ్రీనివాస్ గౌడ్ హాజరై కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 2019 సంవత్సరానికి గానూ కాళోజి నారాయణరావు పురస్కారాన్ని ప్రముఖ కవి కోట్ల వెంకటేశ్వర్ రెడ్డికి అందజేశారు. ఈ అవార్డుతో పాటు రూ.101116 నగదును కూడా ఆయనకు అందజేశారు.

ఈ సందర్బంగా రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ.వి.శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ యాస, భాష ఉనికి కై పోరాడిన కాళోజి గారి కృషి చిరస్మరణీయమని అన్నారు. పుట్టుకనీది చావునీది బతుకంతా తెలంగాణది అని ప్రకటించి తన జీవితమంతా తెలంగాణ కోసం అంకితం చేసిన మహనీయుడు కాళోజీ అని గుర్తుకు చేశారు. తెలంగాణ భాష అన్నా, యాస అన్నా అపారమైన ఆయనకు అభిమానమని. తెలంగాణ భాష, యాసలను ఎవరు కించపరిచినా సహించేవారు కాదని అన్నారు. తెలంగాణ భాషలో సాహిత్యం వెలువరించడమే కాకుండా తెలంగాణ భాషకు పెద్దదిక్కుగా నిలబడ్డారాని కొనియాడారు. తెలంగాణ భాషను తన కవిత్వంలో వినియోగించి, తెలంగాణ భాషాసౌందర్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పారన్నారు. వరంగల్‌లో కాళోజీ పేరిట నిర్మిస్తున్న కళాక్షేత్రం నిర్మాణం త్వరలో పూర్తిచేస్తామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్‌ కేవీ రమణాచారి, సాహిత్య అకాడమీ అధ్యక్షుడు డాక్టర్‌ నందిని సిధారెడ్డి, సంగీత నాటక అకాడమీ అధ్యక్షుడు బాద్మి శివకుమార్‌, మహబూబ్‌నగర్‌ జెడ్పీ చైర్‌పర్సన్‌ స్వర్ణ, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, కాళోజీ ఫౌండేషన్‌కు చెందిన నాగిళ్ల రామశాస్త్రి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY