నేటి నుంచి కొరియన్ ఫిలిం ఫెస్టివల్

0
58
views

ఇండియా, కొరియా దేశాలు పరాయి పాలననుండి విముక్తి పొందిన దేశాలని, ఈ రెండు దేశాలు ఆగష్టు 15న స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా రవీంద్రభారతిలోని పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్ లో ఆగస్టు 12వ తేది నుండి 16వ తేది వరకు కొరియన్ ఫిలిం ఫెస్టివల్ నిర్వహిస్తున్నామని తెలంగాణ భాషా సంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ తెలిపారు.

ఈ సందర్బంగా మామిడి హరికృష్ణ కొరియన్ చిత్రాల కథావస్తువులు భారతీయ చిత్ర కథలకు దగ్గరగా ఉంటాయని, చాలా తెలుగు సినిమాలు కొరియన్ చిత్రాల ఆధారంగా రూపొందాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం తరపున ఇతర రాష్ట్రాల మరియు దేశాల సంస్కృతిని గౌరవిస్తూ, కల్చరల్ ఎక్స్చేంజికి ప్రాధాన్యతను ఇస్తున్నామని, సెన్సిబులిటీతో కూడిన హ్యూమన్ రిలేషన్స్ తో, అద్భుతమైన కంటెంట్ తో అందరిని ఆకట్టుకునే సినిమాలు ఈ ఫెస్టివల్ లో ప్రదర్శిస్తున్నామని అన్నారు. ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు ప్రారంభమయ్యే ఈ ఫిలిం ఫెస్టివల్ కు ప్రవేశం ఉచితమని అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఫెస్టివల్ లో ప్రదర్శించే సినిమాల వివరాలు
12వ తేది – ‘ది అడ్మిరల్: రోరింగ్ కరెంట్స్’ (2014)
13వ తేది – ‘టాక్సీ డ్రైవర్’ (2017)
14వ తేది – ‘బర్న్ ది స్టేజ్: ది మూవీ’ (2018)
15వ తేది -‘బిటీఎస్ వరల్డ్ టూర్: లవ్ యువర్ సెల్ఫ్ ఇన్ సియోల్‌’ (2019)
16వ తేది – ‘వెటరన్’ (2015)

LEAVE A REPLY