డా కె.వి.రమణ – లలిత కళా సేవ పురస్కారాల ప్రదానం

0
33
views

తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో తేజస్విని కల్చరల్‌ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డా. కేవీ రమణాచారి వ జన్మదిన సందర్బంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు పురస్కారాలను ప్రధానం చేశారు. డా. పి.విజయబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డా. కేవీ రమణాచారి దంపుతులను ముఖ్యఅతిథి డా.నందమూరి లక్ష్మి పార్వతి సన్మానించారు.

అనంతరం పురస్కారగ్రహీతలను సన్మానించి, పురస్కారాలను అందజేశారు. పురస్కారాలు అందుకున్న వారిలో సంగీత రంగం నుండి డా.శోభారాజు,సేవ రంగం నుండి లక్కరాజు నిర్మల, సాహితి రంగం నుండి కుమారి శ్రేష్ఠ, వైద్య రంగం నుండి మరోజు జయప్రసాద్ తదితరులున్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సాహితివేత్త ఓలేటి పార్వతీశం, యలవర్తి రాజేంద్రప్రసాద్, వంశీ రామరాజు, డా.పి.విజయ్ బాబు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY