వాల్మీకి రచనలు అందరికి ఆదర్శప్రాయం: మంత్రి శ్రీనివాస్ గౌడ్

0
58
views

రామాయణం రాసిన వాల్మీకి రామునికి సమకాలికుడాని, చరిత్రలో మొట్టమొదటి ఆటో బయోగ్రఫీ రామాయణమేనాని, సకల శాస్త్రాలు రామాయణంలో నుంచే పుట్టినయన్నారు రాష్ట్ర సాంస్కృతిక & పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్. రవీంద్ర భారతిలో తెలంగాణ ప్రభుత్వం వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మహర్షి శ్రీ వాల్మీకి జయంతోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ మహర్షి వాల్మీకి రామాయణంలో ఇచ్చిన సందేశాన్ని ప్రతి ఒక్కరూ పాటించాల్సిన అవసరముందన్నారు.

24 వేల పద్యాల సమాహారమే వాల్మీకి రామాయణ మని అన్నారు. కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత అందరి బతుకులు బాగు పడాలనే ఉద్దేశంతోనే కుల వృత్తులు నష్టపోకుండా రాష్ట్ర ప్రభుత్వం అధిక నిధులు కేటాయించడం జరుగుతుందన్నారు. బోయలకు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని, రాష్ట్రంలో 240 రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టిన ఘనత సిఎం కెసిఆర్ దే అని, ప్రతీ కుల సంఘానికి హైదరాబాద్ లో ఎకరం భూమిచ్చారని ఆయన పేర్కొన్నారు.

వాల్మీల అభివృద్ధికి తన వంతు కృషి ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. వెనుకబడ్డ తరగతుల అభివృద్ధే ముఖ్యమంత్రి లక్ష్యమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.వాల్మీల అభివృద్ధికి తన వంతు కృషి ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బిసి కమిషన్ చైర్మన్ బి. ఎస్ రాములు, స్టేట్ కో ఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ చైర్మన్‌ గట్టు తిమ్మప్ప తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY