రాజ్యసభ సభ్యునిగా ప్రమాణస్వీకారం చేసిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్

0
26
views

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభ సభ్యునిగా శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. మన్మోహన్ సింగ్ 1991 నుంచి 2019 జూన్ వరకు అస్సాం నుంచి రాజ్యసభ‌కు ప్రాతినిధ్యం వహించారు.

జూన్ లో ఆయన పదవికాలం ముగియడంతో ఆయన ఈసారి రాజస్థాన్‌ నుంచి రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు. గత ఎన్నికల్లో అస్సాంలో కాంగ్రెస్ పార్టీ ఓటమితో రాజ్యసభ‌కు పంపడానికి కావాల్సిన ఎమ్మెల్యేల సంఖ్యా బలం లేదు దింతో ఆయనను అధిష్టానం రాజస్థాన్‌ నుంచి రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేయించారు.

మన్మోహన్ సింగ్ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేయగా ఇతర పార్టీల నుంచి పోటీ లేకపోవడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాజస్థాన్‌లో కాంగ్రెస్‌కు 100 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, గులాం నబీ ఆజాద్, అహ్మద్‌ పటేల్‌ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY