కాంగ్రెస్ పార్టీలో చేరిన మైక్ టీవీ అధినేత అప్పిరెడ్డి

0
112
views

మైక్ టీవీ అధినేత అన్నపరెడ్డి అప్పిరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. హుజూర్ నగర్‌లో సోమవారం నిర్వహించిన భారీ బహిరంగ సభలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకొని, కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్నారు. ఆయన ఏహెచ్ఆర్ ఫౌండేషన్ ద్వారా వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఈ సందర్బంగా అప్పిరెడ్డి మాట్లాడుతూ తనను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీలో తనకు ఎటువంటి బాధ్యత అప్పగించిన నిర్వహిస్తానని, పార్టీ ఆశయాలను అనుగుణంగా పని చేస్తానని తెలిపారు. హుజుర్ నగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి పద్మావతి రెడ్డి గెలుపునకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు మల్లు భట్టి విక్రమార్క, జానారెడ్డి, సీతక్క, కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, దామోదర్ రెడ్డి, కుసుమ కుమార్ తదితరుల పాల్గొన్నారు.

LEAVE A REPLY