నవలా నాయికలు పుస్తకావిష్కరణ

0
33
views

హైదరాబాద్ సోమాజిగూడ లోని రూట్స్ కాలేజ్ లో తొమ్మిది వేరువేరు పుస్తకాలమీద తొమ్మిది మంది రచయిత్రులు రాసిన సమీక్షల సమాహారం ‘నవలా నాయికలు’ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఘంటా చక్రపాణి, డా.బోయి విజయభారతి, కవి యాకూబ్ హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్బంగా ఘంటా చక్రపాణి మాట్లాడుతూ తెలుగు భాష ఔన్నత్యాన్ని పెంపొందించేలా రచయితలు కృషి చేయాలన్నారు. తెలుగు భాషకు, పత్రికల మనుగడకు ఢోకా లేదన్నారు. యువత, విద్యార్థులు సాహిత్యంపై అభిలాష పెంచుకోవాలని అందుకు సోషల్ మీడియా చక్కటి వేదికని అన్నారు. సాహిత్య రచనలో పోటీతత్వం ఉండాలని, సాహితీ వేత్తలు సృజనాత్మకమైన రచనలు చేయాలని పిలుపునిచ్చారు.

LEAVE A REPLY