కశ్మీర్, లద్దాఖ్​ల​కు లెఫ్టినెంట్​ గవర్నర్ల నియామకం

0
11
views

జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370ని రద్దు చేసిన కేంద్రం రాష్ట్రాన్ని రెండుగా విభజించిన అనంతరం రెండు కేంద్రపాలిత ప్రాంతాలకు లెఫ్టినెంట్‌ గవర్నర్‌లను నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. జమ్ముకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా గిరీశ్‌ చంద్ర ముర్ము, లద్ధాఖ్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా రాధా కృష్ణ మాథుర్‌లను నియమించింది.

1985 ఐఏఎస్​ బ్యాచ్‌ గుజరాత్‌ కేడర్‌కు చెందిన గిరీశ్‌ చంద్ర ముర్ము… గతంలో ప్రధాని మోదీ గుజరాత్‌ సీఎంగా ఉన్నప్పుడు ప్రిన్సిపల్‌ సెక్రటరీగా పనిచేశారు. ప్రస్తుతం ఆర్థిక మంత్రిత్వ శాఖలో ఖర్చుల విభాగానికి కార్యదర్శిగా సేవలందిస్తున్నారు. 1977 ఐఏఎస్​ బ్యాచ్ త్రిపుర కేడర్‌కు చెందిన రాధా కృష్ణ మాథుర్‌… గతంలో రక్షణ శాఖ కార్యదర్శిగా పనిచేశారు. భారత ప్రధాన సమాచార కమిషనర్‌గా పదవీ విరమణ చేశారు.

రెండు కేంద్రపాలిత ప్రాంతాలు అక్టోబర్‌ 31 నుంచి మనుగడలోకి వస్తాయి.

LEAVE A REPLY