కొత్త మద్యం విధానం ప్రకటించిన ప్రభుత్వం

0
2676
views

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన మద్యం విధానం ప్రకటించింది. నవంబర్​ 1 నుంచి నూతన మద్యం విధానం అమలు కానుంది. దీనికి సంబందించిన నోటిఫికేషన్ ను ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్​ కుమార్ విడుదల చేశారు. ఈ నెల 9 నుంచి 16వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో 2,216 దుకాణాలకు ఈ నెల 18వ తేదీన లాటరీ ద్వారా లైసెన్స్‌దారులను ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. 2019 నవంబర్ 1వ తేదీ నుంచి అక్టోబర్ 2021 వరకు ఈ విధానం అమల్లో ఉంటుంది. గతంలో ఉన్న 4 స్లాబులను 6 స్లాబులుగా ప్రభుత్వం మార్చారు. మద్యం దుకాణాల కోసం నాన్ రిఫండబుల్ దరఖాస్తు ఫీజును రూ. 2 లక్షలు చేశారు. 

జనాభా ప్రాతిపదికన లైసెన్స్​ ఫీజు ను ప్రకటించారు.

1. 5 వేలలోపు జనాభా ఉన్న ప్రాంతాలకు రూ.50 లక్షల లైసెన్స్ ఫీజు
2. 5 వేల నుంచి 50 వేల లోపు జనాభా ప్రాంతాల్లో లైసెన్స్‌ ఫీజు రూ.55 లక్షలు
3. 50 వేల నుంచి లక్షల జనాభా ప్రాంతాల్లో లైసెన్స్ ఫీజు రూ.60 లక్షలు
4. లక్ష జనాభా నుంచి 5 లక్షలలోపు జనాభా ప్రాంతాలకు లైసెన్స్‌ ఫీజు రూ.65 లక్షలు
5. 5 లక్షల నుంచి 20 లక్షలలోపు జనాభా ప్రాంతాలకు రూ.85 లక్షల లైసెన్స్‌ ఫీజు
6. 20 లక్షలకు పైగా జనాభా ఉన్న ప్రాంతాల్లో లైసెన్స్‌ ఫీజు రూ 1.10 కోట్లు గా నిర్ణయించారు.

మద్యం దుకాణాలు తెరచి ఉంచే సమయాలు నిర్దేశించిన ప్రభుత్వం 

  1. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉదయం 10 గం. నుంచి రాత్రి 11 గం.ల వరకు అనుమతి 
  2. ఇతర ప్రాంతాల్లో ఉదయం 10 గం.ల నుంచి రాత్రి 10 వరకు మద్యం దుకాణాలకు అనుమతి ఇచ్చారు.

LEAVE A REPLY