ఆగష్టు 7న తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్

0
15
views

తెలుగు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ప్రకటించింది. ఏపీలో మూడు, తెలంగాణలో ఒక ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించి ఆగస్టు 7న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నెల 14వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 16న నామినేషన్లను పరిశీలిస్తారు. 19 వరకు ఉపసంహరణకు గడువు ఉంటుంది. ఈ నెల 26న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికలు నిర్వహిస్తారు, అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు ఉంటుందని ఈసీ ప్రకటించింది. ఈ నెల 28న ఎన్నికల షెడ్యూల్‌ ముగుస్తుంది.

ఏపీలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కరణం బలరామకృష్ణమూర్తి, కృష్ణ శ్రీనివాస్, వీరభద్రస్వామి ఎంఎల్ఏలుగా గెలిచిన తరువాత ఎమ్మెల్సీ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. తెలంగాణలో టిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీ లోకి మారడంతో యాదవరెడ్డిపై అనర్హత వేటుతో ఉప ఎన్నికలు జరగనున్నాయి

LEAVE A REPLY