లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా

0
60
views

17వ లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా నూతన స్పీకర్‌గా నామినేషన్ వేయనున్నట్టు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఓం బిర్లా కాంగ్రెస్ అభ్యర్థి రాంనారాయణ్‌ మీనాపై 2.5 లక్షల భారీ మెజారిటీతో విజయం సాధించారు. రాజస్థాన్‌లోని కోట నియోజకవర్గం నుంచి ఆయన వరుసగా రెండోసారి ఎంపీగా విజయం సాధించారు.

బిజెపి మిత్రపక్షం బిజూ జనతా దళ్ ఓం బిర్లా అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ రిసొల్యూషన్ ను ప్రవేశ పెట్టారు. దీనికి నేషనల్ పీపుల్స్ పార్టీ , మిజో నేషనల్ ఫ్రంట్ , లోక్ జనశక్తి పార్టీ , వైస్సార్ కాంగ్రెస్ పార్టీ, జేడీయూ, ఐఏడీఎంకే, అప్నా దళ్ పార్టీలు మద్దతు ప్రకటించారు. ఓం బిర్లా ఈ మధ్యాహ్నం స్పీకర్ గా నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఎన్డీయేకి స్పష్టమైన మెజారిటీ ఉన్నందున ఆయన ఎన్నిక లాంఛనంగానే జరగనుంది. 

ఓం బిర్లా 2003లో తొలిసారిగా కోట దక్షిణ నియోజకవర్గం నుంచి రాజస్థాన్‌ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2008, 2013 అసెంబ్లీ ఎన్నికల్లోనూ వరుసగా గెలిచారు. అయన రాజస్థాన్ బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడిగా, బీజేవైఎం జాతీయ ఉపాధ్యక్షుడిగా పని చేశారు.

LEAVE A REPLY