రేపటి నుంచి పైడి జైరాజ్ ఫిలిం ఫెస్టివల్

0
87
views

తెలంగాణ ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో పైడి జైరాజ్ జయంతిని పురస్కరించుకొని ‘పైడి జైరాజ్ ఫిలిం ఫెస్టివల్’ ను సెప్టెంబరు 23వ తేది నుండి 27వ తేది వరకు నిర్వహిస్తున్నామని పర్యాటక & సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. పైడి జైరాజ్ నటించిన సినిమాల్లోంచి ఉత్తమమైన ఐదు సినిమాలను ఎంపిక చేసి ప్రతి రోజూ సాయంత్రం 6.30 గంటలకు ప్రదర్శిస్తున్నామన్నారు.

రవీంద్రభారతిలోని పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్ వేదికగా అనేక సినీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఉచితంగా నిర్వహిస్తున్న ఈ ఫిలిం ఫెస్టివల్‌కు పైడి జైరాజ్ అభిమానులు, సినీ ప్రియులు హాజరై సినిమాలను వీక్షించి, ఫిలిం ఫెస్టివల్‌ను విజయవంతం చేయాలన్నారు.

ప్రదర్శనల వివరాలు
సోమవారం (23.09.2019)
సా. గం. 6.30 ని.లకు – రిటర్న్ ఆఫ్ మిస్టర్ సూపర్‌మెన్ (Return Of Mr Superman)-1960

మంగళవారం (24.09.2019)
సా. గం. 6.30 ని.లకు – బాబీ (Bhabhi) -1938

బుధవారం (25.09.2019)
సా. గం. 6.30 ని.లకు – సింగార్ (Singaar) – 1949

గురువారం (26.09.2019)
సా. గం. 6.30 ని.లకు – నయీ కహానీ (Nai Kahani) – 1943

శుక్రవారం (27.09.2019)
సా. గం. 6.30 ని.లకు – హతిమ్ తాయి (HatimTai) – 1956

LEAVE A REPLY