రైతు సమన్వయ సమితులను బలోపేతం చేస్తా: పల్లా రాజేశ్వర్‌రెడ్డి

0
9
views

గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు రైతు సమన్వయ సమితులను బలోపేతం చేస్తామని రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం జూబ్లీహిల్స్‌లోని రైతు సమన్వయ సమితి కార్యాలయంలో ఆయన పదవి భాద్యతలు చేపట్టాడు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిషలు కృషి చేస్తున్నారని అన్నారు. రాష్ట్రం ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం దేశానికే ఆదర్శమన్నారు. రైతులను సంఘటితం చేయడమే తన లక్ష్యమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మహముద్‌ అలీ, జగదీశ్‌ రెడ్డి, ఈటల రాజేందర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, శ్రీనివాస్ యాదవ్, వి.శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత, మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎమ్మెల్యేలు ,ఎమ్మెల్సీలు తదితరులు హాజరయ్యారు.

LEAVE A REPLY