కాంగ్రెస్ పార్టీలో చేరిన పల్లె రవి కుమార్

0
846
views

టీయూడబ్య్లూజే రాష్ట్ర ఉపాధ్యక్ష్యుడు, సీనియర్ జర్నలిస్ట్ పల్లె రవి కుమార్ గౌడ్ నేడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ తీర్ధం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ పాల్గొన్నారు.

తెలంగాణ ఉద్యమంలో ఒక పక్క జర్నలిస్ట్ గా ఉద్యోగ ధర్మన్ని, మరోపక్క ఉద్యమ కర్తవ్యాన్ని మోసి రాష్ట్ర సాధనలో కీలక పాత్రను పోషించారు. 2009 ఎన్నికల్లో అయన మునుగోడు నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉంటే కేసీఆర్ ఆదేశం మేరకు అయన దానిని విరమించుకున్నారు. ఈసారి తెలంగాణ ఎన్నికల్లో బిసిలు అధికంగా ఉండే మునుగోడు నియోజకవర్గం నుండి అయన టికెట్ వస్తుందని ఆశించారు, కానీ ఆయనకు నిరాశే మిగిలింది.

అయినా కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ నుండి తనకు ఏదైనా హామీ లభిస్తుందని అనుకున్నాడు , ప్రజా ఆశీర్వాద సభలో భాగంగా చండూర్ లో జరిగిన సభలో కనీసం అయన ఊసు కూడా తీయకపోవడంతో మనస్థాపానికి గురైయ్యాడు. తన అభిమానుల కోరిక మేరకు అయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు తెలంగాణ జాగృతి రాష్ట్ర అధికార ప్రతినిధి దోనికేన కుమారస్వామి మరియు జాగృతి రాష్ట్ర కార్యదర్శి శ్రీకాంత్ కూడా కాంగ్రెస్ పార్టీ లో చేరారు.

LEAVE A REPLY