ఫొటో జర్నలిస్టులకు ఛాయాచిత్రాల పోటీలు

0
13
views

ఆగస్టు 19 అంతర్జాతీయ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ ఫొటో జర్నలిస్టులకు రాష్ట్ర స్థాయి ఉత్తమ వార్త ఛాయా చిత్రాల పోటీలు 2019 నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఫొటో జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు అనుమల్ల గంగాధర్‌, ప్రధాన కార్యదర్శి కె.ఎన్‌.హరి తెలిపారు.

2018 ఆగస్టు నుంచి 2019 జూలై వరకు తీసిన మూడింటిని కలర్‌లో 8×10 సెం.మీ లేదా 10×12 సెం.మీ సైజులో ఫొటోలను ఫొటో జర్నలిస్టుల సంఘం, రెండో అంతస్తు, దేశోద్ధారక భవన్‌, బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌కు ఈ నెల 15వ తేదీలోగా పంపించాలని సూచించారు. పోటీల్లో ఎంపికైనవాటికి మొదటి బహుమతిగా రూ.10వేలు, రెండో బహుమతిగా రూ.8వేలు, మూడో బహుమతిగా రూ.5వేలు అందజేస్తామని, వీటితోపాటు మరో 15 ఉత్తమ ఫొటోలకు రూ.వెయ్యి చొప్పున ప్రోత్సాహక బహుమతులను ఈనెల 25న జరిగే కార్యక్రమంలో ప్రముఖుల చేతుల మీదుగా అందజేయనున్నట్లు వారు పేర్కొన్నారు. పూర్తి వివరాలకు కోసం 8712320567, 9849987039లో సంప్రదించాలని వారు కోరారు.

LEAVE A REPLY