నామినేషన్ దాఖలు చేసిన ప్రధాని మోదీ

0
13
views

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నియోజకవర్గం నుంచి ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ దాఖలు చేశారు. వారణాసి కలెక్టర్ కార్యాలయంలో తన నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేశారు. 2014 సాధారణ ఎన్నికల్లో మోదీ వారణాసితో పాటు వడోదర(గుజరాత్‌) నుంచి కూడా పోటీ చేసి రెండు చోట్ల గెలుపొందారు. అయితే వడోదర నుంచి తప్పుకొని వారణాసి నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. 2014 సాధారణ ఎన్నికల్లో వారణాసి నుంచి 3,71,784 లక్షల మెజారిటీతో నరేంద్ర మోదీ ఆమ్‌ ఆద్మీ పార్టీ అద్యక్ష్యుడు అరవింద్‌ కేజ్రీవాల్‌ పై విజయం సాధించారు.

ఈ కార్యక్రమానికి బీహార్ సీఎం నితీశ్ కుమార్, శిరోమణి అకాలీ దళ్ నాయకుడు ప్రకాశ్ సింగ్ బాదల్, శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే, అన్నాడీఎంకే నేతలు పన్నీర్‌సెల్వం, తంబిదురై, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్, నితిన్ గడ్కరీ,రామ్‌విలాస్ పాశ్వాన్ తదితరులు హాజరయ్యారు.

LEAVE A REPLY