ప్రకాష్ రాజ్ ‘దోసిట చినుకులు’ పుస్తకావిష్కరణ

0
45
views

తెలంగాణ కళా భారతి( ఎన్టీఆర్ ) స్టేడియంలో జరుగుతున్న జాతీయ పుస్తక ప్రదర్శన కార్యక్రమంలో సోమవారం ప్రముఖ సినీ నటులు ప్రకాష్ రాజ్ రచించిన ‘దోసిట చినుకులు’ పుస్తకావిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా బుక్ ఫెయిర్ అధ్యక్షుడు జూలూరి గౌరీశంకర్ మాట్లాడుతూ ప్రకాశ్ రాజ్ గొప్ప నటుడు మాత్రమే కాదు గొప్ప రచయిత అని ఈ పుస్తకం చదివిన తరువాత తెలుస్తుందని అన్నారు. జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ హత్యను ఖండించి , బెంగుళూరు లో ప్రదర్శన నిర్వహించినందుకు హైదరాబాద్ బుక్ ఫెయిర్ తరపున అభినందించారు. సమాజంలో జరుగుతున్న అన్యాయాలనూ, అరాచకాలనూ బహిరంగంగా తనదైన శైలిలో ఈ పుస్తకం ద్వారా అయన ప్రశ్నించారని అన్నారు.

ఈ సందర్భంగా ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ రాసిన తరువాత మాట్లాడడానికి ఏమి లేదని తన పుస్తకానికి వచ్చినా ఆదరణకు అయన ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. సమాజంలో జరుగుతున్న దారుణాలపై గళమెత్తాలని నిర్ణయించుకున్నట్లు ఆయన చెప్పారు.  ఈ కార్యక్రమంలో తనికెళ్లభరణి , దర్శకుడు కృష్ణవంశీ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY