సబ్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన ఐఏఎస్ ప్రాంజల్‌ పాటిల్

0
48
views

దేశంలోనే తొలి అంధ మహిళా ఐఎఎస్‌ గా రికార్డు సృష్టించిన ప్రాంజల్‌ పాటిల్ (31) తిరువనంతపురం సబ్‌ కలెక్టర్‌గా సోమవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. 2015 సివిల్‌ సర్వీసె్‌సలో మొదటి ప్రయత్నంలోనే 773వ ర్యాంకు సాధించారు. 2017 లో మరో ప్రయత్నంలో 124వ ర్యాంకు సాధించారు. కేరళలోని ఎర్నాకుళం లో 2018 నుంచి ఇప్పటివరకు అసిస్టెంట్‌ కలెక్టర్‌గా పనిచేశారు.

మహారాష్ట్రలోని ఉల్‌హస్‌నగర్‌కు చెందిన ప్రాంజల్‌ పాటిల్‌ తన ఆరేళ్ళ వయస్సులోనే కంటి చూపు కోల్పోయారు. తరగతి గదిలో సహ విద‍్యార్థి పొరపాటున పెన్సిల్‌తో కంట్లో గుచ్చడంతో తాను కోల్పోయింది. ఐఎఎస్‌ కావాలన్న ఆమె లక్ష్యానికి అంధత్వం ఏ మాత్రం అడ్డంకి కాలేదు. అనేక అవరోధాలను దాటుకుని సివిల్‌ సర్వీసులకు ఎంపికై తొలి అంధ మహిళగా రికార్డుల్లోకెక్కారు.

LEAVE A REPLY