హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్

0
12
views

దక్షిణ భారతదేశంలో శీతాకాల విడిది నిమిత్తం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రత్యేక విమానం రాజహంసలో హైదరాబాద్‌కు చేరుకున్నారు. హకీంపేట విమానాశ్రయంలో గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్‌, స్పీకర్‌ పోచారం , శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , పలువురు మంత్రులు రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికారు. ఈ నెల 28వరకు బొల్లారంలోని రాష్ట్రపతి భవన్‌లో ఆయన బసచేయనున్నారు.

రాష్ట్రపతి కోవింద్ హైదరాబాద్ షెడ్యూల్ ఇదే

22న రాజ్‌భవన్‌లో రెడ్‌క్రాస్‌ సొసైటీ బ్రాంచ్‌ను కోవింద్ ప్రారంభించనున్నారు. 23న పాండిచ్చేరి యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొంటారు. 25న కన్యాకుమారిలోని వివేకానంద రాక్‌ మెమోరియల్‌‌ను సందర్శించనున్నారు. అనంతరం తిరువనంతపురంలో బసచేసి 27వ తేదీన హైదరాబాద్ హకీంపేట విమానాశ్రయం చేరుకుంటారు. 27న రాష్ట్రపతి నిలయంలో ఎట్‌హోం కార్యక్రమంలో పాల్గొని, 28న మధ్యాహ్నం ఢిల్లీకి రాష్ట్రపతి కోవింద్‌ తిరుగు పయనం కానున్నారు.

LEAVE A REPLY