పూరి జగన్నాథ్ నెక్స్ట్ సినిమా ఆ హీరోతోనా?

0
17
views

పూరి జగన్నాథ్ నెక్స్ట్ సినిమా ఆ హీరోతోనా?

పూరి జగన్నాథ్ దాదాపు నాలుగు ఏళ్ళ తర్వాత ఇస్మార్ట్ శంకర్ తో మంచి హిట్ ని అందుకున్నారు, కానీ ఇస్మార్ట్ శంకర్ కూడా తన ఆకలిని ఇంకా తీర్చలేదని మొన్న ఆ మధ్య ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పారు. అయితే ఇస్మార్ట్ శంకర్ ఇచ్చిన బూస్ట్ తో ఆ సినిమాకు సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నట్లు ఆల్రెడీ ” డబల్ ఇస్మార్ట్” టైటిల్ కూడా రిజిస్టర్ చేసినట్లు చెప్పారు, కానీ ఈ డబల్ ఇస్మార్ట్ కన్నా ముందు పూరి ఇంకో చేయబోతున్నాడు అని తెలుస్తోంది. దాదాపు ఒక రెండు ఏళ్ళ క్రితం పూరి ” జనగణమన” అనే సినిమాని మహేష్ బాబు తో చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది, పలు కారణాల వాళ్ళ ఆ సినిమా సినిమా అయితే కార్యరూపం దాల్చలేదు, ఇప్పుడు అదే టైటిల్ పూరి సెన్సషన్ స్టార్ కె.జి.ఫ్ తో సెన్సేషన్ సృష్టించిన ” యాష్ “తో ఈ సినిమా ని ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.యాష్ KGF 2 సినిమాని కూడా నవంబర్ లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు, అది అవ్వగానే యాష్-పూరి సినిమా స్టార్ట్ అవ్వబోతోంది అని సమాచారం.

LEAVE A REPLY