పౌరసత్వ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం

0
11
views

పౌరసత్వ సవరణ బిల్లు-2019కి రాజ్యసభ ఆమోదం తెలిపింది. మెజార్టీ సభ్యులు ఆమోదం తెలపడంతో పౌరసత్వ సవరణ బిల్లు సభలో ఆమోదం పొందినట్లు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు ప్రకటించారు. ఓటింగ్ సమయంలో సభలో 230 మంది సభ్యులు ఉన్నారు. బిల్లు ఆమోదం పొందాలంటే 121 మంది మద్దతు తెలపాల్సి ఉండగా, 125మంది సభ్యులు అనుకూల ఓటు వేశారు, 105మంది సభ్యులు ప్రతికూలంగా ఓటు వేశారు. ఏడు గంటల సుదీర్ఘ చర్చ అనంతరం బిల్లును పెద్దల సభ ఆమోదించింది.

LEAVE A REPLY