బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే రేవూరి

0
94
views

నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు రేవూరి ప్రకాష్‌ రెడ్డి బుధవారం ఢిల్లీలో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా ఆధ్వర్యంలో బిజెపి లో చేరారు. ఆయనతో పాటు టీఆర్‌ఎస్‌ మాజీ ఎంపీ రవీంద్ర నాయక్‌ కు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌ రావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్‌, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్బంగా రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ రాజకీయ పునరేకీకరణ కోసమే బీజేపీ లో చేరానని, టీడీపీ, ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పై ఎలాంటి కోపం, వ్యతిరేకత లేదని అన్నారు. తెలంగాణాలో బీజేపీ ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదుగుతుందని అన్నారు.

LEAVE A REPLY