సాహిత్య అకాడమీ పురస్కారాల ప్రదానం

0
59
views

రవీంద్రభారతి కాన్ఫరెన్స్‌ హాల్లో తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో సాహిత్య అకాడమీ పురస్కారాలు- 2019 ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది. కవిత్వం విభాగంలో కవి సిద్ధార్థ కవితా సంపుటి బొమ్మలబాయికి, వచన రచనల విభాగంలో ఉప్పల నరసింహం కథల సంపుటి మట్టి మనిషికి గాను సిద్ధార్థ, ఉప్పల నరసింహం పురస్కారాలను అందుకున్నారు. పురస్కారాల క్రింద రూ.1,00,116లు నగదు, ప్రశంసాపత్రం, జ్ఞాపిక, శాలువాతో పురస్కార గ్రహీతలను ఘనంగా సన్మానించారు.

ఈ సందర్బంగా తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ డాక్టర్‌ నందిని సిధారెడ్డి మాట్లాడుతూ పురస్కారాలను గానూ 2014 నుంచి ప్రచురితమైన గ్రంథాలను పరిగణలోకి తీసుకుని వాటిని అన్ని కోణాల్లో క్షుణ్ణంగా పరిశీలించి, వాటిని శాస్త్రీయ పద్ధతిలో జ్యూరీ మూడవ వడపోత అనంతరం పురస్కారాలకు ఎంపిక చేసినట్టు తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో సాహిత్య అకాడమీ పురస్కారాలను ఇచ్చే సంప్రదాయముందని, కేంద్ర సాహిత్య అకాడమీ కూడా ప్రత్యేకంగా సాహిత్య పురస్కారాలను అందిస్తుందని కానీ తెలంగాణ ఏర్పడ్డాక తొలిసారిగా తెలంగాణ సాహిత్య అకాడమీ పురస్కారాలు ఇవ్వడం ఆనందంగా ఉందని అన్నారు.

పురస్కారగ్రహీతలు మాట్లాడుతూ తెలంగాణ సాహిత్య అకాడమీ వ్యవస్థానాంతరం తొలిసారిగా ఏర్పాటు చేసిన సాహిత్య అకాడమీ పురస్కారం అందుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో సాహిత్య అకాడమీ చైర్మన్ డాక్టర్‌ నందిని సిధారెడ్డి, కార్యదర్శి డాక్టర్‌ ఏనుగు నరసింహారెడ్డి, ప్రముఖ కవులు శివారెడ్డి, యాకుబ్, స్కై బాబా, సంగిశెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


 వచన రచనల విభాగంలో కథల సంపుటి ‘మట్టి మనిషి’కి గాను అవార్డు స్వీకరించిన ఉప్పల నరసింహం
కవిత్వం విభాగంలో కవితా సంపుటి ‘బొమ్మలబాయి’కి గాను పురస్కారం స్వీకరించిన కవి సిద్ధార్థ

LEAVE A REPLY