‘అర్జున’ అవార్డు అందుకున్న సాయిప్రణీత్‌

0
15
views

ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకంతో సరికొత్త చరిత్ర సృష్టించిన తెలుగు షట్లర్‌ సాయి ప్రణీత్‌ గురువారం అర్జున పురుస్కారం అందుకున్నాడు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి భవన్‌లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా అతను పురస్కారాన్ని స్వీకరించాడు.

అనంతరం సాయి ప్రణీత్‌ మాట్లాడుతూ ప్రతిష్టాత్మక అర్జున అవార్డు తనకు దక్కడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ పతకం సాధించిన అనంతరం మరిన్ని చాంపియన్‌ షిప్‌లపై దృష్టి సారిస్తున్నానని ప్రణీత్‌ చెప్పారు.

LEAVE A REPLY