తెలంగాణ చిన్నమ్మ ‘సుష్మా స్వరాజ్‌’ ఇకలేరు

0
13
views

బీజేపీ సీనియర్‌ నాయకురాలు, మాజీ విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ (67) నిన్న రాత్రి కన్నుమూశారు. మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో ఆమె గుండెపోటుకు గురవడంతో, ఆమెను హుటాహుటిన ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఎమర్జెన్సీ వార్డులో ఆమెకు వైద్యులు అత్యవసర చికిత్స చేశారు. ఆమెను కాపాడేందుకు వైద్యులు విఫలయత్నం చేశారు. రాత్రి 10.50 గంటల సమయంలో ఆమె మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.

సుష్మ స్వరాజ్ 1952 ఫిబ్రవరి 14న హరియాణాలోని అంబాలాలో జన్మించారు. 1977లో హర్యానా శాసన సభకు తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇరవై ఐదేండ్ల వయసులో హర్యానా క్యాబినెట్ మంత్రిగా నియమితురాలై, దేశంలోనే అత్యంత పిన్నవయసులోనే మంత్రి అయిన వ్యక్తిగా రికార్డుల్లోకెక్కారు.

సుష్మ స్వరాజ్ రాజకీయప్రస్థానం
-1977-82: హర్యానా శాసన సభకు తొలిసారి ఎంఎల్ఏ గా ఎన్నిక
-1977-79: హర్యానా ప్రభుత్వంలో కార్మిక, ఉపాధి మంత్రిగా బాధ్యతలు
-1987-90: హర్యానా శాసనసభ సభ్యురాలిగా రెండోసారి ఎంఎల్ఏ గా ఎన్నిక
-1987-90: విద్య, ఆహార, పౌరసరఫరాల మంత్రిత్వ శాఖల బాధ్యతలు
-1990-96: రాజ్యసభకు తొలిసారి ఎన్నిక
-1996-97: 11వ లోక్‌సభకు ఎన్నిక (ఎంపీగా రెండోసారి: 1996 మే 15- 1997 డిసెంబర్4)
-1996: (మే 16 – జూన్ 1) కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రిగా బాధ్యతలు
-1998-99: 12వ లోక్‌సభకు ఎన్నిక (ఎంపీగా మూడోసారి: 1998 మార్చి 10- 1999 ఏప్రిల్ 26)
-1998: (మార్చి 19- అక్టోబర్ 12) కేంద్ర సమాచార, ప్రసారశాఖతోపాటు అదనంగా టెలీకమ్యూనికేషన్ల శాఖ బాధ్యతలు
-1998: (అక్టోబర్ 13- డిసెంబర్ 3) ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి (ఢిల్లీ తొలి మహిళా ముఖ్యమంత్రిగా రికార్డు )
-1998: (నవంబర్) హజ్ ఖాస్ నియోజకవర్గం నుంచి ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నిక. అనంతరం రాజీనామా. లోక్‌సభ సభ్యురాలిగా కొనసాగింపు
-2000-06: రాజసభ్యకు ఎన్నిక (ఎంపీగా నాలుగోసారి)
-2000-03: (2000 సెప్టెంబర్ 30- 2003 జనవరి 29) వాజపేయ్ ప్రభుత్వంలో కేంద్ర సమాచార, ప్రసారశాఖ బాధ్యతలు
-2003-04: (2003 జనవరి 29- 2004 మే 22) కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, పార్లమెంటరీ వ్యవహారాల బాధ్యతలు
-2006-09: (2006 ఏప్రిల్) రాజ్యసభకు ఎన్నిక (ఎంపీగా ఐదోసారి)
-2009-14: (2009 మే 16- 2014 మే 18) 15వ లోక్‌సభకు ఎన్నిక (ఎంపీగా ఆరోసారి)
-2009-09: ( 2009 జూన్ 3 – 2009 డిసెంబర్ 21) లోక్‌సభలో ప్రతిపక్ష ఉప నేత
-2009-14: (2009 డిసెంబర్ 21- 2014 మే 18) లోక్‌సభలో ప్రతిపక్ష నేత
-2014-19: (2014 మే 26 నుంచి ) 16వ లోక్‌సభకు ఎన్నిక (ఎంపీగా ఏడోసారి)
-2014-19: (2014 మే 26- 2019 మే 29) మోడీ ప్రభుత్వంలో కేంద్ర విదేశాంగ మంత్రిగా బాధ్యతలు

LEAVE A REPLY