‘తలచినదే జరిగినదా’ చిత్రం ప్రారంభం

0
43
views

రామానాయుడు స్టూడియోలో షైన్ పిక్చర్స్ బ్యానర్ పై కి శేఖర్ రెడ్డి, సంధ్య రెడ్డి నిర్మాతలుగా నూతన దర్శకుడు సూర్యతేజ దర్శకత్వంలో ‘తలచినదే జరిగినదా’ చిత్రం ప్రారంభోత్సవం జరిగింది.  ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలను చిత్రయూనిట్‌ నేడు నిర్వహించింది. ఈ చిత్రం ప్రారంభోత్సవంలో ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత సి. కళ్యాణ్ హాజరయ్యి క్లాప్ ఇవ్వగా, తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ కెమెరా స్విచ్ ఆన్ చేయగా, దండు సినిమా దర్శకుడు సంజీవ్ కుమార్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో హీరోగా రామ్ కార్తిక్, హీరోయిన్ గా ఊర్వశి పరదేశి నటిస్తున్నారు.

ఈ చిత్ర దర్శకుడు సూర్య తేజ మాట్లాడుతూ వైవిధ్యమైన కథతో కామెడీ ఫిక్షన్ త్రిల్లర్ గా ఈ సినిమా ఉంటుందని, మంచి సాంకేతిక నిపుణులతో తెరకెక్కిస్తున్నామని అన్నారు. జులై 8 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలై మొత్తం 2 షెడ్యూల్స్ లో సినిమా పూర్తిచేస్తామన్నారు.

పోసాని కృష్ణ మురళి, సత్యం రాజేష్, సత్య, కేదార్ శంకర్, నళిని, మోహన్ గౌడ్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు మిహి రామ్స్ సంగీతం అందిస్తున్నారు.

Talachinade Jariginada Movie Opening Stills

LEAVE A REPLY