టాక్ “లండన్ – చేనేత బతుకమ్మ – దసరా” వేడుకల పోస్టర్ ఆవిష్కరించిన మాజీ ఎంపీ కవిత

0
24
views

తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆద్వర్యంలో సెప్టెంబర్ 28 వ తేదీన నిర్వహించే “లండన్ – చేనేత బతుకమ్మ – దసరా ” వేడుకల పోస్టర్ ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు.

హైదరాబాద్ లో టాక్ ప్రతినిధుల బృందం సభ్యులు మాజీ ఎంపీ కవిత ను కలిశారు. ఈ సందర్భాంగా కవిత మాట్లాడుతూ చేనేత పేరుతో బతుకమ్మ వేడుకల్ని నిర్వహించడం వినూత్నంగా ఉందని, వీరి ప్రయత్నం ఫలించి నేత కుటుంబాలకు మేలు జరగాలని కోరుతూ శుభాకాంక్షలు తెలిపారు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేనేతకు చేయూతనివ్వడానికి చేస్తున్న కార్యక్రమాలకు స్పూర్తితో, గత కొన్ని సంవత్సరాలుగా టాక్ జరిపే బతుకమ్మ వేడుకలను “చేనేత బతుకమ్మ” గా నిర్వహిస్తున్నామని, వీలైనంత వరకు ప్రవాసులల్లో చేనేత పై అవగాహన కలిపించి, వీలైనన్ని సందర్భాల్లో చేనేత వస్త్రాలు ధరించి నేత కుటుంబాలకు అండగా నిలవాలని కోరుతున్నట్టు టాక్ సభ్యులు తెలిపారు.

లండన్ నుండి టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం మరియు టాక్ అధ్యక్షురాలు పవిత్ర కంది ఫోన్ ద్వారా మీడియా కి తమ సందేశాన్నిస్తూ, టాక్ సంస్థ ఆవిర్భావం నుండి నేటి వరకు అన్ని సందర్భాలలో కవిత గారి ప్రోత్సాహం చాలా గొప్పదని, నేటి “చేనేత బతుకమ్మ” పోస్టర్ ఆవిష్కరించి మాలో నూతన ఉత్సాహాన్ని నింపిన కవిత గారికి ప్రత్యేక కృతఙ్ఞతలు తెలియజేస్తున్నామని చెప్పారు.

అన్నివేళలా వారి సూచనలు సలహాలు మాకెంతో ప్రోత్సహాన్ని కలిగిస్తున్నాయని , చేనేత కుటుంబాల సంక్షేమం పట్ల వారికి ఎంత శ్రద్ధ ఉందని, ఇటువంటి కార్యక్రమాల వల్ల వారికి వీలైనంత చేయూత అందితే చాలా సంతోషమని కవిత అభిప్రాయపడ్డట్టు తెలిపారు.

సెప్టెంబర్ 28 వ తేదీనాడు ఎంగిలి పూల బతుకమ్మ తో వేడుకలు ప్రారంభమవుతాయని కాబట్టి లండన్ లో నివసించే ప్రవాస ఆడబిడ్డలంతా వేడుకల్లో పాల్గొని బతుకమ్మకు పెద్ద ఎత్తున స్వాగతం పలకాలని, ఈ సంవత్సరం సాయంకాలాన మన ఊర్లో జరిగినట్టు వేడుకులు నిర్వహిస్తున్నామని, ప్రవాసులంతా సెప్టెంబర్ 28 న సాయంత్రం 4 గం. ల నుండి వెస్ట్ లండన్ లోని ” ఐసల్ వర్త్ అండ్ సయాన్ స్కూల్”( Isleworth and Syon School,Ridgeway Road,Isleworth,Middlesex,TW75LJ) ఆడిటోరియం లో జరిగే వేడుకలకు , ప్రవాస బిడ్డలంతా వీలైతే చేనేత దుస్తులు ధరించి వేడుకల్లో పాల్గొనాలని, చేనేతకు అండగా నిలవాల్సిన చారిత్రాత్మక సమయమిదని వారు తెలిపారు. చేనేత వాస్త్రాలకై www.tauk.org.uk వెబ్సైట్ ను సందర్శిస్తే వివరాలు ఉన్నాయని తెలిపారు.

ప్రతియేటా రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలంగాణ ఆడబిడ్డలకు బతుకమ్మ కానుకగా చేనేత చీరలను అందిస్తుందని, మనమంతా మన ముఖ్యమంత్రి కెసిఆర్ గారి ఆశయాలకు అనుగుణంగా, ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్న అన్ని బతుకమ్మ వేడుకల్లో, చేనేతకు ప్రాధాన్యతనిస్తూ, చేనేతదుస్తులతో వేడుకలను జరువుపుకుంటే, చేనేత కుటుంబాల్లో గొప్ప భరోసా వస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు, టాక్ ప్రతినిధులు నవీన్ రెడ్డి, రరవి ప్రదీప్ పులుసు, సుప్రజ పులుసు, రాజ్ కుమార్ శానబోయిన, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY